Thursday, November 21, 2024

TG | డ్యూటీలో నిర్ల‌క్ష్యం.. ఇన్‌స్పెక్టర్లపై ఐజీ రంగ‌నాథ్‌ సీరియ‌స్ యాక్ష‌న్‌

పోలీసు డ్యూటీ విష‌యంలో నిర్ల‌క్ష్యం చేసిన కార‌ణంగా మ‌ల్టీ జోన్-1 ఐజీ రంగ‌నాథ్ సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకున్నారు. ఈ క్ర‌మంలో అవినీతికి పాల్ప‌డుతున్నట్టు ఆధారాలు ల‌భించ‌డంతో ఇద్ద‌రు ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను స‌స్పెండ్ చేశారు. అదే క్ర‌మంలో మ‌త క‌ల్లోలం, ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్ల‌క్ష్యం కార‌ణంగా మ‌రో ముగ్గురు ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను ఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

- Advertisement -

ఖమ్మంలోని సత్తుపల్లి రూరల్ పరిధిలోని పేకాటరాయుళ్ల‌కు సహకరిస్తూ.. అవినీతికి పాల్పడుతున్న సత్తుపల్లి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశంతో పాటు.. అధికార దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు నమోదు చేసినందుకు ములుగు జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఐజీ ఏవీ రంగనాథ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

మరో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయానికి అటాచ్..

మతకల్లోలం, అల్లర్ల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మెదక్ టౌన్, రూరల్ ఇన్ స్పెక్టర్లు ఎస్.దిలీప్‌కుమార్‌, బి.కేశవులు అలాగే… అధికార‌ పర్యవేక్షణ లోపం కార‌ణంగా భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.రాజేశ్వర్‌రావును మల్టీ జోన్‌ 1 ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ మల్టీజోన్‌ 1 ఐజీ ఏవీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement