అమెరికాకు చెందిన టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రెండో సారి తల్లైంది. ఆమె ఆడబిడ్డకే జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అలెక్సిస్ ఒహానియన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఫొటోలు పంచుకున్నారు. పాపకు అధీరా రివర్ ఒహానియా అని పేరు కూడా పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు ఇల్లంతా ఆనందంతో నిండిపోయినట్లు చెప్పారు. తనకు మరో అద్భుతమైన బహుమతి ఇచ్చావని గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ ఆల్టైమ్ అంటూ భార్యపై అలెక్సిస్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా, సెరెనా-అలెక్సిస్కు ఇప్పటికే ఓ పాప ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడా చిన్నారికి ఆరేళ్లు.