వింబుల్డన్-2022 టోర్నీలో ప్రఖ్యాత క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు చుక్కెదురైంది. ఈ టోర్నీ తొలి రౌండ్ పోటీల్లో ఓటమి చవిచూసింది. ఏడుసార్లు చాంపియన్‌గా నెగ్గిన సెరెనా ఫ్రాన్స్‌కు చెందిన వరల్డ్ నెంబర్ 115 క్రీడాకారిణి హర్మోనీ టాన్ చేతిలో పరాజయం పాలైంది.దాదాపు 3 గంటల పది నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి రేపింది. గత ఏడాది వింబుల్డెన్ టోర్నీలో అర్ధంతరంగా వైదొలగిన ఆమె ఈసారి గ్రాండ్‌స్లామ్ కొట్టాలని కలలుగంది. మంగళవారంనాడు సెంట్రల్‌కోర్టులోకి చిరునవ్వు నవ్వుతూ అడుగుపెట్టిన ఆమెకు ప్రత్యర్థి చుక్కలు చూపించింది.
23 సార్లు గ్రాండ్‌స్లామ్ సాధించి, 7 సార్లు వింబుల్డెన్ చాంపియన్‌గా నెగ్గిన సెరెనా ఆదిలోనే వెనుదిరగాల్సి వచ్చింది. టాన్‌తో తలపడ్డ సెరెనా సుదీర్ఘంగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. 5-7,6-1,6-7 (7) తేడాతో ఓటమిపాలయ్యింది. కాగా టాన్ వింబుల్డన్‌లో ఆడటం ఇదే ప్రథమం. కాగా గ్రాస్ కోర్టులో ఆడుతున్న నాలుగో టోర్నీ ఇది. కాగా సెరెనా ఇప్పటివరకు 21 వింబుల్డెన్ టోర్నీల్లో పాల్గొంది. డ్రా చూసిన తరువాత సెరెనా పేరు చూసి భయమేసిందని, ఆమెతో ఆడి రెండుమూడు గేమ్స్ గెలుచుకోగలనేమోనని అనుకున్నానని ఆ తరువాత టాన్ పేర్కొంది. కాగా ఆమె ఆడుతున్నంత సేపూ ప్రేక్షకులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.