సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా, అది కూలిపోయి ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతిచెందిన విషాధ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. పబ్లిక్ టాయ్‌లెట్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందారు. ముంబైలోని ఏక్తా నగర్‌లో మున్సిపల్ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్ కూలడంతో అందులోపడిపోయారు. ఊపిరాడకపోవడంతో దుర్మరణం చెందారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని సెప్టిక్ ట్యాంక్‌లోనుంచి వెలికితీవి శతాబ్ది దవాఖానకు తరలించారు. అయితే వారు అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital