Friday, November 22, 2024

సెప్టెంబరులో సాధారణం కంటే అధిక వర్షపాతం: ఐఎండీ

సెప్టెంబ‌ర్‌లో సాధార‌ణం కంటే అధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌వ‌తుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) బుధ‌వారం అంచ‌నా వేసింది. జులై, ఆగ‌స్ట్‌లో వ‌ర్షాలు చాలినంత‌గా కుర‌వ‌క‌పోవ‌డంతో సెప్టెంబ‌ర్‌లో ఐఎండీ అంచ‌నా రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. వాతావ‌ర‌ణ శాఖ వివ‌రాల ప్ర‌కారం ఆగస్ట్‌లో సాధారణం కంటే 24 శాతం త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోద‌వ‌గా, జులైలోనూ సాధార‌ణం కంటే ఏడు శాతం త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

సెప్టెంబ‌ర్‌లో సాధార‌ణం కంటే అధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ ఎండీ మృత్యుంజ‌య మ‌హాపాత్ర వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం దేశంలో వ‌ర్ష‌పాతం 9 శాతం త‌క్కువ‌గా ఉండ‌టంతో సెప్టెంబ‌ర్‌లో మెరుగైన వ‌ర్షాల‌తో ఈ లోటు మ‌రింత త‌గ్గుతుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. సెప్టెంబ‌ర్‌లో మ‌ధ్య భార‌త్‌లో సాధార‌ణం కంటే అధికంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ పేర్కొంది.

ఈ వార్త కూడా చదవండి: పాము విషంతో కరోనాకు చెక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement