దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఊగిసలాట ధోరణి అవలంబించాయి. ఉదయం సెన్సెక్స్ 55,629.30 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 55,755.09 పాయింట్ల గరిష్టానికి.. 55,020.10 పాయింట్ల కనిష్టాన్ని సెన్సెక్స్ సూచీ తాకింది. చివరికి 778.38 పాయింట్ల నష్టంతో.. 55,468.90 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16,593.10 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16,678.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,478.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని నిఫ్టీ సూచీ తాకింది. చివరికి 187.95 పాయింట్లు నష్టపోయి.. 16,605.95 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.75 వద్ద కొనసాగుతున్నది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు.
దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది మార్కెట్‌ను మరింత నష్టాల్లోకి నెట్టేస్తున్నది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, రిలయన్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, బజాజ్ షేర్లు లాభపడ్డాయి. మారుతీ, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. లోహ, ఇంధన, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభపడ్డాయి. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, హెల్త్‌కేర్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ 50 సూచీలో 14 షేర్లు లాభపడగా.. 36 షేర్లు నష్టోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..