Wednesday, November 20, 2024

రైల్వే సంచలన నిర్ణయం.. పరిహారం 10 రెట్లు పెంపు !

భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రైలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు కేవలం 50వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. కాని కొత్తగా రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పది రెట్లు అంటే ఒక్కొక్క బాధిత కుటుంబానికి 5లక్షల రూపాయల పరిహారం ఇవ్వనుంది.

- Advertisement -

రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి 2.5లక్షల రూపాయలు పరిహారం అందజేయనుంది రైల్వే బోర్డు. ఇక స్వల్ప గాయాలపాలైన ప్రయాణికులకు 50వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అంతే కాకుండా తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన ప్రయాణికులకు రోజు వారి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని రైల్వే ప్రకటించింది. అది కూడా 30రోజులకు మించి ప్రయాణికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటూ అతనికి రోజుకు 3వేల చొప్పున పరిహారం చెల్లించనున్న‌ట్టు తెలిపింది.

రైలు ప్రమాదాలతో పాటు సిగ్నల్స్,కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదానికి గురైన వారికి పెంచిన పరిహారం అందజేయాలని రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు తక్షణం అమల్లోకి వచ్చాయి.

గతంలో ట్రైన్ యాక్సిడెంట్స్‌లో గాయపడిన వారికి కేవలం 5వేల రూపాయల పరిహారం ఇచ్చేది రైల్వే బోర్డు. ఇప్పుడు దాన్ని కూడా 10రెట్లు పెంచింది. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి 10రోజులకు ఒకసారి ఎక్స్‌గ్రేషియా చెల్లించనుంది.

ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైళ్లలో దోపిడీలు వంటి అవాంఛిత ఘటనల సమయంలో ఈ పరిహారాలు వరుసగా రూ.1.50 లక్షలు, రూ.50 వేలు, రూ. 5 వేలుగా నిర్ణయించారు. సెప్టెంబర్‌ 18న జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు వెంటనే ఆచరణలోకి వస్తాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement