జైలులోనే తనని అంతమొందించాలని ప్రయత్నిస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తీన్మార్ మల్లన్న టీం భవిష్యత్ కార్యాచరణ’ పేరుతో ఘట్కేసర్ మండలం కొర్రెములలో సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున పాత నేరస్థుల సహకారంతో తనను చంపాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే, వారి ప్రయత్నం విఫలం కావడంతో తర్వాతి రోజు జైలులో తనను ఓ చీకటి గదిలో బంధించారని అన్నారు. మానసిక దివ్యాంగులకు ఇచ్చే ఔషధాలను బలవంతంగా తనకు ఎక్కించి పిచ్చివాడిని చేయాలనుకున్నారని మల్లన్న ఆరోపించారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
జైలులోనే చంపాలనుకున్నారు..తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement