న్యాయవ్యవస్థలో అందరూ సమానులే అని ..న్యాయ వ్యవస్థ గురించి సామాన్య ప్రజలు గుండెల మీద చెయ్యి వేసుకునే ఈ విధంగా గా న్యాయ వ్యవస్థ పని చేస్తుందని.. లీగల్ అధారిటీ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కరణ్ కుమార్ తెలిపారు.శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో.. 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి చైర్మన్ కమ్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె అరుణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జడ్జి కరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ గ్రామాలకు చేర్చాలంటే న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, ఎన్జీవోలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. న్యాయం అనేది అందరికీ ఒకటే అని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఏడు వేల ఐదు వందల పాఠశాలల్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి.. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించామని వివరించారు. రెండు రోజుల క్రితం నగరిలో పర్యటించిన సందర్భంగా ఆర్టీసీ డిపోలో సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. న్యాయవ్యవస్థ ప్రతి ఒక్క గుండెని తట్టాలని, అందుకోసమే మన తెలుగు తేజం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతి చిత్తూరులోనే 1200 పోస్టాఫీసుల్లో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. గత పది రోజుల క్రితం మైనర్ బాలికకి వివాహం చేశారని తన వద్దకు వచ్చిందని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత దిశా పోలీస్ స్టేషన్ డీఎస్పీ అధికారులను ఆదేశించామన్నారు.
అంతేకాకుండా బాలిక తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం సందర్భంగా మొత్తం 25 వేల మొక్కలను నాటామని.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో అవసరమన్నారు. నవంబర్ 14వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో న్యాయమూర్తులు.. న్యాయవాదులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కోర్టు నుండి ర్యాలీగా పెళ్లి మండపం వరకు చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ సివిల్ జడ్జి కె అరుణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు మరియు పారా లీగల్ వాలంటీర్లు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.