Tuesday, November 26, 2024

సీనియ‌ర్ న‌టి జ‌య‌మాలిని.. కుమారుడి వివాహం

అప్ప‌ట్లో ఐటెంసాంగ్స్ అంటే జ‌య‌మాలిని జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత పేర్లే వినిపించేవి. ఇప్పుడంటే హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. 80వ దశకంలో వెండితెరపై జయమాలిని ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆమె పోలీస్ అధికారి పార్తీబన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమ‌య్యారు. కుటుంబానికే ప్రాధాన్యతను ఇస్తూ సంతోషకర జీవితాన్ని గడుపుతోంది. జయమాలిని, పార్తీబన్ ల పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులే. వారి కుమారుడు హరి స్పెయిన్ లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆయన వివాహం జరగబోతోంది. చెన్నైకి చెందిన ప్రియాంకతో మద్రాస్ వీజీపీ గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ లో వివాహం జరగనుంది. పెళ్లి కూతురు ప్రియాంక ఇంజినీరింగ్ చేసిన తర్వాత ఐఐఎంలో ఎంబీఏ చేసింది. ఫిబ్ర‌వ‌రి 23రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకకు అలనాటి నటీనటుల హాజరుకానున్నారు. ఈ మేర‌కు కుమారుడి పెళ్లి ప‌త్రిక‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు జ‌య‌మాలిని.

Advertisement

తాజా వార్తలు

Advertisement