ప్రస్తుతం టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదం రాజుకుంటోంది. అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేష్ పదవీ కాలం పూర్తవడంతో మరి కొద్ది రోజుల్లో కొత్తవారిని ఎన్నుకునేందుకు ఇండస్ట్రీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడి బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్, హేమ, నరసింహారావు వంటి ప్రముఖులు పోటీ పడుతున్నారు. వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో నటి హేమ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘మా’ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని హేమ చేసిన ఆరోపణలను సీనియర్ నటుడు నరేష్ తిప్పికొట్టారు.
ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని కూడా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఈ వార్త కూడా చదవండి: వాట్సాప్‌లో కోవిడ్ సర్టిఫికెట్ తీసుకోవడం ఎలా?