సీనియర్ నటుడు ..దర్శకుడు వల్లభనేని జనార్థన్ రావు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా చికిత్స పొందుతూనే జనార్దన్ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.అతను విజయవాడలో 1959లో రాఘవేంద్ర రావు, శేష చంద్రావతి దంపతులకు జన్మించాడు. లయోలా పబ్లిక్ స్కూలులో, శాతవాహన కళాశాలలో చదువుకున్నాడు.
కళాశాలలో చదువుతున్నప్పుడే నాటకాల్లో నటించేవాడు. కళాశాల విద్య అనంతరం “కళామాధురి” పేరుతో నాటక సంస్థను ప్రారంభించాడు. నాటకాలలో నటునిగా దర్శకునిగా నాటకాభిమానుల ప్రశంసలు పొందాడు. తరువాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. సాగర్ దర్శకత్వం వహించిన స్టూవర్టుపురం దొంగలు చిత్రంలో అతనికి వేషం లభించింది.హీరో వెంకటేష్ నటించిన సూర్య ఐ.పి.ఎస్ చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలను చూసి అతని మామ విజయబాపినీడు గ్యాంగ్ లీడర్ సినిమాలో పోలీసు పాత్రను ఇచ్చాడు. ఆ సినిమాలోని పాత్ర అతనికి గుర్తింపు తెచ్చింది. అక్కడ నుండి నటునిగా కొనసాగాడు. సినిమాలతో పాటు సీరియళ్లలో (అన్వేషిత) కూడా నటించాడు.