రల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్.. కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్ 28వ సమ్మిట్ దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, యూకే ప్రధాని రిషి సునక్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సహా ప్రపంచ నేతలంతా హాజరయ్యారు.
COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ వాతావరణ మార్పులపై కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్ చేశారు. దుబాయ్‌లో జరుగుతున్న పార్టీల 28వ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. “COP28లో గుడ్ ఫ్రెండ్స్.. #Melodi” అంటూ ఇటాలియన్ ప్రధాని మెలోని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.