Saturday, July 6, 2024

TG | టీపీసీసీ చీఫ్ ఎంపిక తాత్కాలికంగా వాయిదా..

పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియను కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేయనున్నట్లుగా ప్రకటించింది. తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం వివిధ నేతల పేర్లను పరిగణనలోకి తీసుకోగా.. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఈ విషయంపై వారం రోజుల తర్వాత మరోసారి చర్చించాలని నిర్ణయించారు.

తెలంగాణ పీసీసీ పదవి రేసులో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎంపీలు బలరాంనాయక్, సురేష్ షెట్కార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క కూడా టీపీసీసీ చీఫ్‌ పదవిని కోరుతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement