Tuesday, November 26, 2024

Delhi | ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట శేజల్ నిరసన..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి ఎమ్మెల్యే (బీఆర్ఎస్) దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆరిజిన్ డైరీ డైరెక్టర్ బోడపాటి శేజల్ మరోసారి దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం పార్లమెంట్ ఎదురుగా ప్లకార్డులు పట్టుకుని తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు తన పోరాటం ఆగదని ఆమె అన్నారు.

- Advertisement -

మణిపూర్‌లో మహిళలపై జరిగిన అకృత్యాలు చాలా బాధాకరమని వ్యాఖ్యానించిన శేజల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సొంత రాష్ట్రంలో మహిళపై జరిగిన అన్యాయంపై స్పందించే సమయం లేదు కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలపై మాత్రం క్షణాల్లో స్పందించి రాజకీటయాలు చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. గతంలోనూ ఓసారి ఢిల్లీ వచ్చిన శేజల్.. జాతీయ మహిళా కమిషన్‌తో పాటు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.

జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు పంపి నివేదికలు పంపాల్సిందిగా ఆదేశించింది. ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా దుర్గం చిన్నయ్య అనుచరులు వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ శేజల్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement