అసోంలో రూ.42 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామ్‌రూప్ జిల్లాలో ఇంటర్ స్టేట్ డ్రగ్స్ పెడ్లర్స్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 1.50 లక్షల యాబా టాబ్లెట్స్ రూపంలో వీటిని తరలిస్తుండగా పట్టుకున్నట్టు వివరించారు. బహిరంగ మార్కెట్‌లో ఈ డ్రగ్స్ విలువ రూ.42 కోట్లు ఉంటుందని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఓ ప్రత్యేక బృందం కామ్‌రూప్ జిల్లా.. జిరిఘాట్ ఏరియాలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ బృందానికి డీఎస్‌పీ కళ్యాణ్ పాఠక్ నేతృతం వహించారు. అసోం-మణిపూర్ సరిహద్దులో.. ఏప్రిల్ 13న 500 గ్రాముల హెరాయిన్ కూడా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. గువాహటి, బెంగాల్ మీదుగా.. బంగ్లాదేశ్‌కు ఈ డ్రగ్స్ తరలిస్తుండగా.. పట్టుకున్నట్టు కామ్‌రూప్ జిల్లా ఎస్‌పీ హితేష్ సీహెచ్ రాయ్ తెలిపారు. ఓ ట్రక్కు నుంచి వీటిని సాధీనం చేసుకున్నామని, ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్టు కూడా చేశామని వివరించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఈ డ్రగ్స్‌ను తీసుకుని.. బంగ్లాదేశ్‌కు తరలించేందుకు నియమించబడిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ డ్రగ్స్ రాకెట్‌తో కనెక్షన్ ఉన్న ముగ్గురిని ఇప్పటి వరకు అరెస్టు చేశామని ప్రకటించారు. అరెస్టు చేసిన వారిని మణిపూర్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్, ఇలియాస్ ఖాన్‌గా గుర్తించామని, మరోకరిని పశ్చిమ బెంగాల్ కూచ్ బహార్‌కు చెందిన సద్దాం అలియాస్ సమినుల్ హక్ అని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్ గువాహటి జాయింట్ కమిషనర్ పార్థ సారథి సూపర్‌వైజ్ చేసినట్టు ఎస్‌పీ వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..