ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం మీదుగా లారీలో తరలిపోతున్న డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.50కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. డ్రగ్స్ తరలిస్తున్న లారీని సీజ్ చేశారు. ఇది గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పట్టుబడిన డ్రగ్స్‌ను చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పక్కా సమాచారంతో పట్టివేత…
పక్కా సమాచారంతో పోలీసులు డ్రగ్స్‌ను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న డీఆర్‌ఐ, నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ లారీ డ్రగ్స్‌ను గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ఓడరేవు నుంచి లారీలో వాటిని ముంబైకి తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు.