సీతారామ ప్రాజెక్టులోని 3 పంప్‌హౌజ్‌లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మూడు పంప్‌హౌస్‌లను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు (ఆదివారం) ఈ పంప్ హౌస్‌ల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సీతారామ ప్రాజెక్టుకు గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అనుమతులు వచ్చాయని… సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కు గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల నీళ్ల కేటాయింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందన్నారు. అలాగే 1,2 ప్యాకేజీలకు సరిపడా భూసేకరణకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలో మూడు వేల ఎకరాలు సేకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర అడవులు పర్యావరణ శాఖాతో సంప్రదింపులకు నిర్ణయం తీసుకున్నం. రైల్వే క్రాసింగ్ లు కాలువల నిర్మాణాలకు ఆటంకం కలుగకుండా చూడాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.