Tuesday, November 26, 2024

లాకడౌేన్‌ వద్దు.. ప్రత్యామ్నాయాలు చూడాలే..

దేశంలో, రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తున్న నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ విధింపు వంటి చర్యలపై స్థానిక పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్‌ తొలి, రెండవ వేవ్‌ల నిరోధానికి విధించిన లాక్‌డౌన్‌ల ప్రభావం నుంచి అటు దేశ, ఇటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పరిస్థితుల్లో థర్డ్‌వేవ్‌ నిరోధానికి రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు విధిస్తే పరిస్థితి మళ్లి మొదటికి వస్తుందని సీఐఐ, ఎఫ్‌టీసీసీఐ తదితర పరిశ్రమ అసోసియేషన్‌ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న ఒమిక్రాన్‌, సాధారణ కోవిడ్‌ కేసులతో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి అంశాలు తెరమీదకు వచ్చాయి. ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో పాటు సాధారణ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున తెలంగాణతో పాటు దేశంలోని పలురాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు.

పరిశ్రమలకు సమస్యలు..
ఈ ఆంక్షలతో పరిశ్రమలకు మళ్లి సమస్యలు రావొచ్చన్న వాదన వినిపిస్తోంది. రానున్న రోజుల్లో కేసులు భారీగా పెరిగి మళ్లి లాక్‌డౌన్‌ విధిస్తే ఆర్థిక వ్యవస్థ మందగించి ఈ ప్రభావంతో మళ్లి పరిశ్రమల పరిస్థితి సంక్షోభంలో పడే అవకాశం ఉందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికిగాను లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూ వంటి పరిష్కారాలు కాకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. కరోనాకు ముందు నుంచే నోట్ల రద్దు, జీఎస్టీ లాంటివరుస సంస్కరణలతో మందగమనానికి గురైన ఆర్థిక వ్యవస్థ ప్రభావంతో ఇబ్బందుల పాలైన రాష్ట్రంలోని అధిక సంఖ్యలో పరిశ్రమలకు కరోనాతో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లయిందని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. కరోనా తొలి, రెండవ వేవ్‌లను నిరోధించడానికి విధించిన జాతీయ, స్థానిక లాక్‌డౌన్‌లతో పరిశ్రమలకు ఇటు ఉత్పత్తి, అటు డిమాండ్‌ పరంగా తీవ్ర సమస్యలెదురైన పరిస్థితిని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఉద్యోగులు సరైన వేళల్లో కర్మాగారాలకు రాలేక పోవడం సమస్యలను ఎదు ర్కొన్నట్లు అసోసియేషన్‌లు పేర్కొంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement