కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో న్యాయ యాత్రకు భద్రత కల్పించేందుకు జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
అయితే, నిన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తొలగించి గౌహతిలోకి ప్రవేశించినప్పుడు కాంగ్రెస్- బీజేపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.అసోం పోలీసులు తగిన భద్రత కల్పించడంలో విఫలం అయ్యారని హోం మంత్రికి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ Z+ భద్రతకు అర్హుడని తెలిపారు. ఇది కాకుండా, కాంగ్రెస్ పోస్టర్లను చింపివేయడంతో పాటు జనవరి 21న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పర్యటనను అడ్డుకోవడంతో పాటు రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడిని గురించి ప్రస్తావించారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ పని జరిగిందని ఖర్గే ఆరోపించారు. రాహుల్ గాంధీ కాన్వాయ్ దగ్గరికి వచ్చేందుకు పోలీసులు బీజేపీ కార్యకర్తలకు పర్మిషన్ ఇచ్చారు అని మల్లికార్జున మండిపడ్డారు.