కొవిడ్ – 19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారు చేస్తోన్న హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థకి భారీగా భద్రత పెంచారు. కేంద్రం నిర్ణయం మేరకు ఇవాళ్టి నుంచి హైదరాబాద్ శామీర్ పేట్ లో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్ కు సీఐఎస్ఎఫ్ భద్రతా చర్యలు చూస్తున్నారు. శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రవాదులు ముప్పు నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించిన మేరకు నేటి నుంచి పహారా షురూ అయింది.
భారత్ బయోటెక్ ముందు సీఐఎస్ఎఫ్ భారీ భద్రత..
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement