Friday, November 22, 2024

Editorial: భద్రత డొల్ల…!

సరిగ్గా 22 ఏళ్ళ క్రితం పార్లమెంటుపై దాడి జరిగిన రోజునే బుధవారం నాడు సభలోకి దుండగులు ప్రవేశించి టియర్‌ గ్యాస్‌ వదలడం యాదృచ్ఛికమే అని సరిపె ట్టుకోవడానికి లేదు. ఈ దాడి వెనుక అనుమానించేం దుకు ఎన్నో కారణాలున్నాయి. దేశంలో అత్యంత కట్టుది ట్టమైన భద్రతా వలయంలో ఉండే పార్లమెంట్‌లో ఇలాం టి ఘటన జరగడం జాతిని నివ్వెరపరుస్తోంది.

ప్రజా స్వామ్యానికి పట్టుగొమ్మ అయిన పార్లమెంటులో జరిగి న ఈ దాడి భారత సార్వభౌమాధికారంపైనా, సర్వస త్తాక ప్రతిపత్తిపైన, సమగ్రతపైనా జరిగిన దాడిగా భావిం చక తప్పదు. ఇది దేశానికే సిగ్గుచేటు. సభలో స్మోక్‌ టెర్రర్‌ ని సృష్టించేందుకు దుండగులు పక్కా ప్రణాళికతో వచ్చి నట్టు స్పష్టం అవుతోంది. బుధవారం లోక్‌సభలో ప్రవేశించిన దుండ గులు ఎవరికీ హాని చేయకపోయినా, సభ్యులను ఊపిరి ఆడ కుండా చేయడానికి టియర్‌ గ్యాస్‌ని విడిచిపెట్టారు. తాజా దాడికి సంబంధిం చిన పూర్తి వివరాలు ఇంకా తెలియకపోయినా, ఇది ముమ్మా టికీ భద్రతా లోపమని స్పష్టం అవుతోంది. ప్రేక్షకుల గ్యాల రీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలో అలజడి సృష్టించారు. ఒకరు గ్యాలరీలోనే టియర్‌ గ్యాస్‌ను వదలగా, మరొకరు సభ్యు లను దాటుకుంటూ, బల్లలపై నుంచి గెంతుతూ స్పీకర్‌ స్థానం వైపు దూసుకువెళ్ళిన దృశ్యాలు భద్రతా వైఫల్యాన్ని కళ్లకు కట్టాయి. ప్రజల్లో తీవ్ర కలవరాన్ని కలిగించాయి. శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేప థ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అయినా ఆ దుండగులు ఎలా ప్రవేశించారన్నది అంతు చిక్కడం లేదు. నిజానికి దేశంలో పార్లమెంట్‌కు ఉన్నంత భద్రత మరెక్కడా ఉండదు. 22 ఏళ్ల క్రితం సరి గ్గా ఇదే రోజు పార్లమెంట్‌పై దాడి జరగడం, తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భద్రత వ్య వస్థను మరింత పటిష్టం చేశారు. పార్లమెంట్‌లో ప్రవేశించడం ఆషామాషీ కాదు. సభ్యులు, అధికారులు, సిబ్బంది.. చివరకు తోటమాలి అ యినా ఐడీ, ఇతర ఆధారాలు చూపితేనే ప్రవేశం. మూడంచెల్లో నఖశిఖ పర్యంతం తనిఖీలు చేస్తారు. బాడీ స్కా నింగ్‌ చేయడం సహా అనేక అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తారు. లోక్‌సభ సభ్యుల సిఫార్సు ఉంటేనే విజిటర్లకైనా అనుమతి లభిస్తుంది. అందువల్ల అలాంటి విజిటర్ల వల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమైతే.. ఆ సభ్యుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాడికి పాల్పడిన నిందితులు మైసూర్‌ ఎంపీ పేరిట జారీ అయిన సందర్శకుల పాస్‌తో సభలో ప్రవేశించారని చెబుతున్నారు. ఒక పాస్‌పై ఎంతమందిని పంపుతారు? వారిని ఎటువంటి సోదాలు, తనిఖీలు చేయకుండా లోనికి పంపారా? అందరి కళ్లుగప్పి టియర్‌ గ్యాస్‌ కంటెయినర్లను వారు ఎలా తీసుకువెళ్లారో తేల్చాల్సి ఉంది. వారి వద్ద టియర్‌ గ్యాస్‌ కంటైనర్‌ ఉంటే, స్కానర్లు కూడా పసిగట్ట లేకపోవడమేమిటో? పరిచయం లేని వ్యక్తులను సభ ఆవరణలోకి సాధారణంగా అనుమతించరు. ఈ దుండగులు దర్జాగా ఎలా ప్రవేశిం చగలిగారు? అన్నవి అం దరి మనసులను తొలుస్తున్న ప్రశ్నలు. ఈ దాడి వ్యవ హారంలో ఆరుగురి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. వారిలో ఇద్దరు పార్లమెంటు లోపల, మరో ఇద్దరు బయట అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. పార్ల మెం ట్‌ వద్ద ఇలాంటి దాడి జరగడం ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఈ సం ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఇందుకు పూర్తిగా తాను బాధ్యత వహిస్తున్నాననీ, ఈ ఘటనపై దర్యాప్తు నకు ఆదేశించామనీ, బాధ్యులని నిగ్గు తేలినవారిపై చర్యలు తీసుకుంటామని సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సంఘటన భారత పౌరులందరినీ కలచి వేసింది. ఈ సం ఘటనకు ఖలిస్తాన్‌ తీవ్రవాదులు బాధ్యులై ఉండవచ్చు నన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఖలిస్తాన్‌ నాయకు డు, జ స్టిస్‌ ఫర్‌ సిక్‌ నాయకుడు గురు పత్వంత్‌సింగ్‌ పన్నూ డిసెంబర్‌ 13వ తేదీన భారత పార్లమెంటుపై దాడి చేయనున్నట్టు చేసిన ప్రకటన ఇందుకు ఆధారంగా చూపుతున్నారు. ఖలిస్తాన్‌ ఉద్యమ నాయకులు భారత్‌పై కక్ష ఎందుకు పెంచుకున్నారో ఇప్పటికీ తెలియదు. ఖలిస్తాన్‌ తీవ్రవాది నిజ్జార్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించడం విడ్డూరం. ఖలిస్తాన్‌ తీవ్రవాదులు కెనడాలోను, ఆస్ట్రేలియాలోనూ హిందూ దేవాల యాలపై దాడులు జరపడాన్ని భారత్‌ ఖండించింది. ఈ విషయమై అమెరికాకూ, ఐక్యరాజ్య సమితికీ ఫిర్యాదు చేసింది. ఖలిస్తానీ నాయకుల మధ్య గొడవలే నిజ్జార్‌ హత్యకు కారణం. ఈ మధ్య మరో ఖలిస్తాన్‌ నాయకుడు అను మానాస్పద స్థితిలో మరణించాడు. ఈ మర ణాలతో భారత్‌కి సంబంధం అంటగట్టేందుకు పన్నూ వంటి తీవ్ర వాదులు ప్రయత్నించడాన్ని కూడా భారత్‌ ఖండించింది. బహుశా ఈ కారణంపైనేమో భారత్‌ పార్లమెంటుపై దాడి జరుపుతామని అతడు ప్రకటించి ఉంటాడు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే జైషే అహ్మద్‌ అనే తీవ్రవాద సంస్థ కు చెందిన సభ్యులే 22 ఏళ్ళ క్రితం మన పార్లమెంటుపై దాడి చేశారు. ఇప్పుడు ఆ సంస్థ అంత క్రియాశీలంగా లేదు. అందువల్ల బుధవారం పార్లమెం టుపై జరిగిన దాడి ఖలిస్తాన్‌ ప్రోద్బలంతోనే జరిగినట్టు భావించాల్సి వస్తోంది. ఈ సంఘటనలో బాధ్యులంతా కర్నాటక, హర్యానా, మహారాష్ట్రలకు చెందిన వారే. వీరి వెనక ఎవరున్నారో నిగ్గు తేల్చాలి. రాజకీయ కక్షలతో అమాయకులపై కేసులు బనాయిస్తే ప్రజలు సహించరు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఈ మధ్య చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో అనుమానితులను అరెస్టు చేస్తోంది. ఇంత పెద్ద ప్రమాదాన్ని ముందు పసిగట్టలేకపోవడం ఘోరవైఫల్యమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement