దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన భారతీయ రైల్వే…. ప్రతిరోజు కోట్లాది మందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ రైల్వేకు ప్రత్యేక స్థానం ఉంది… ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉంటే, రైల్వే శాఖ ప్రతి సంవత్సరం దేశంలోని రిచ్చెస్ట్ రైల్వే రైల్వే స్టేషన్లు, వాటి ఆదాయ వివరాలను ప్రకటిస్తుంది. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరం వివరాలను వెల్లడించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం వచ్చిన 100 రైల్వే స్టేషన్లలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా స్టేషన్‌కు రెండో స్థానం లభించగా, చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్‌ను రైల్వేశాఖ ప్రకటించింది.
రైల్వే స్టేషన్ల ఆదాయం వివరాలు…
- న్యూఢిల్లీ – రూ.3,337 కోట్లు.
- హౌరా (వెస్ట్ బెంగాల్) – రూ.1,692 కోట్లు.
- చెన్నై సెంట్రల్ (తమిళనాడు) – రూ.1,299 కోట్లు.
- సికింద్రాబాద్ (తెలంగాణ) – రూ.1,276 కోట్లు.
- హజరత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) – రూ.1,227 కోట్లు.
- లోకమాన్య తిలక్ టెర్మినల్ (ముంబై) – రూ.1,036 కోట్లు.
- అహ్మదాబాద్ (గుజరాత్) – రూ.1,010 కోట్లు.
- ముంబై సీఎస్‌టీ (మహారాష్ట్ర) – రూ.982 కోట్లు.