Saturday, November 23, 2024

Passport | పాస్‌పోర్ట్‌ల జారీలో 5వ స్థానంలో సికింద్రాబాద్..

దేశంలోని 37 ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో సికింద్రాబాద్ అయిదో స్థానంలో ఉందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసర్ స్నేహజ (శుక్రవారం) తెలిపారు. 2023 సంవత్సరంలో పాస్‌పోర్ట్ కార్యాలయ పనితీరు గురించి ఆమె మీడియాకు వెల్లడించారు. పాస్‌పోర్ట్‌ల జారీ చేయ‌డంలో మొదటి నాలుగు స్థానాల్లో ముంబై, బెంగళూరు, లక్నో, చండీగఢ్ ఉండ‌గా.. సికింద్రాబాద్ ఐదో స్థానంలో నిలిచిన‌ట్టు ఆమే వివ‌రించారు. అయితే, పాస్‌పోర్ట్‌ల కోసం ఎవరూ బ్రోకర్లను సంప్రదించవద్దని సూచించారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 7,85,485 పాస్‌పోర్ట్‌లను జారీ చేసినట్లు వెల్లడించారు. 2022తో పోలిస్తే ఈసారి లక్షా నలభై వేలకు పైగా పాస్‌పోర్ట్‌లు అధికంగా జారీ చేశామన్నారు. తత్కాల్ పద్ధతిలో పాస్‌పోర్ట్‌ల జారీకి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతోందని… సాధారణ దరఖాస్తులు ప్రాసెస్ కావడానికి దాదాపు ఇరవై రెండు రోజుల సమయం తీసుకుంటోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement