హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాసం బోనాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.16 జూలైన అంబర్‌పేటలో జరగనున్న శ్రీమహంకాళి బోనాల ఏర్పాట్ల పై శుక్రవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్షించారు. సీఎం కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఆలయాల ఏర్పాట్లకు నిధులు కేటాయించారని చెప్పారు. 9వ తేదీన సికింద్రాబాద్ మంహంకాళి బోనాలు, 16న హైదరాబాద్‌పాతస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలకు వారం రోజుల ముందు 10లేదా11వ తేదీన ఆలయాల్లో బోనాల ఏర్పాట్లకోసం ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
బోనాలఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తలసాని చెప్పారు. భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ పోలీసులు వాహనాల దారి మళ్లించాలన్నారు. ఆలయాల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో పాటుగా శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్, కార్పొరేట్లు పద్మ, విజయ్ కుమార్ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ వేణుగోపాల్, దేవాదాయ శాకఖ అసిస్టేంట్ కమిషనర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.