Thursday, September 12, 2024

Secunderabad – ఇక డైరెక్ట్ గా గోవాకు రైలు…..

సికింద్రాబాద్ నుంచి వారానికి రెండు సార్లు
అందుబాటు ధ‌ర‌లో టిక్కెట్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు వెళ్లాలనుకొనే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా రైలు సర్వీసు వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటివరకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వీక్లీ సర్వీసు, కాచిగూడ నుంచి సాధారణ, ఏసీ, స్లీపర్‌ సర్వీసు గుంతకల్‌ వద్ద గోవా రైలుతో అనుసంధానంతో కొనసాగుతున్నాయి. అయితే, గోవాకు నేరుగా రైలు సర్వీసు కేటాయించాలని పలువురు రైల్వే శాఖను కోరారు.

- Advertisement -

దీంతో, వచ్చే వారం నుంచి సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు అందుబాటులోకి రానుంది. ప్రతి ఏటా దాదాపు గోవాను సందర్శిస్తున్న 80 లక్షల మందిలో 20 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బుధ, శుక్ర వారాల్లో సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడిగామకు, గురు, శనివారాల్లో గోవా నుంచి సికింద్రాబాద్‌కు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. రైలు ప్రయాణ సమాయాలతో పాటుగా స్టేషన్లు, టికెట్ ధరల పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే అధికారికంగా వీటి పైన ప్రకటన చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement