Saturday, November 23, 2024

Secret Camera | రెంటు ఇంట్లో సీక్రెట్​ కెమెరా.. హైదరాబాద్​లో ఇంటి ఓనర్​ పాడుపని..

హైదరాబాద్‌ , ఆంధ్రప్రభ : అద్దెకు ఇచ్చిన ఇంటిలో సీక్రెట్‌ కెమెరాను అమర్చి గమనిస్తున్న యజమాని వికృత చేష్ట ఇది. అద్దెకు ఉన్నవారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎదుట నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​ జూబ్లిహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి వెంకటగిరిలోని పైలమ్‌ కాలనీలో జరిగింది. అస్సోం రాష్ట్రానికి చెందిన సోదరి, సోదరుడు వారి స్నేహితురాలితో కలిసి జూబ్లిహిల్స్‌ లోని రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు. తాముండే రెస్టారెంట్‌కు సమీపంలోనే రెండు నెలల క్రితం సయ్యద్‌ సలీంకు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

తామున్న ఇంట్లో మీటర్‌ బాక్స్‌ ఏర్పాటు చేయడంతో వారికి అనుమానం వచ్చింది. దాంట్లో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. బాక్స్‌ తెరచి చూస్తే దాంట్లో రహస్య కెమెరా ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. ఆ కెమెరా తీగ యజమాని సయ్యద్‌ సలీం ఇంట్లోని కంప్యూటర్‌కు కలిపిన విషయాన్ని గుర్తించారు. తామేం చేస్తున్నామో తెలుసుకోవడానికి ఏర్పాటుచేసిన రహస్య కెమెరా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత జూబ్లిd హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారున్న ఇంటికి చేరుకుని రహస్య కెమెరాను చూసి కంగుతిన్నారు. వాళ్లు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే యజమాని సయ్యద్‌ సలీంను పిలిపించి కెమెరా విషయం గూర్చి అడిగారు.

మొదట్లో కెమెరా కాదని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు గట్టిగా అడగడంతో తన నేరాన్ని అంగీకరించాడు. కెమెరా తీగ ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతుందో సలీం ద్వారానే తెలుసుకున్నారు. ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు తన సెల్‌ ఫోన్‌కు ప్రత్యేక యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్న విషయాన్ని పోలీసులు గమనించారు. అందుకోసం రెండు డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీ ఆర్‌) లు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు తన ఇంటి చుట్టూ నాలుగు కెమెరాలను కూడా ఏర్పాటుచేసుకున్నాడు. వెంటనే సలీంను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి సెల్‌ ఫోన్‌, డీవీఆర్‌ , కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement