Home క్రీడాప్రభ IND vs AUS | ఆసీస్‌తో రెండో టెస్టు.. అందరి చూపు భారత్‌పైనే !

IND vs AUS | ఆసీస్‌తో రెండో టెస్టు.. అందరి చూపు భారత్‌పైనే !

0
IND vs AUS | ఆసీస్‌తో రెండో టెస్టు.. అందరి చూపు భారత్‌పైనే !

ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత జట్టు సన్నద్ధమైంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టుపై 295 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టుకు బొటన వేలు గాయంతో దూరమైన శుభ్‌మన్‌ గిల్‌ మళ్లి జట్టులోకి వచ్చాడు. దీంతో బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరంగా భారత జట్టు పటిష్టంగా ఉంది.

అదే ఊపుతో కౌన్‌బెరాలో డిసెంబ‌ర్ 6 (శుక్ర‌వారం) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులోనూ గెలుపొందాలనే లక్ష్యంతో భార‌త జ‌ట్టు బరిలోకి దిగనుంది. అటు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. తొలి టెస్టులో సెంచరీలతో కదంతొక్కిన జైస్వాల్‌, కోహ్లీలను కట్టడి చేస్తే, భారత్‌పై పైచేయి సాధించవచ్చని ఆసీస్‌ భావిస్తోంది.

ఇక ఇరు జట్ల విషయానికొస్తే…

గాయం కారణంతో తొలి టెస్టుకు శుభ్‌మన్‌ గిల్‌ దూరం కావడంతో అతని స్థానంలో దేవదత్‌ పడిక్కల్‌ ఆడాడు. కానీ పడిక్కల్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒకవేళ రెండో టెస్టుకు గిల్‌ సిద్ధమైతే, అప్పుడు బ్యాటింగ్‌ పొజిషన్స్‌లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఫస్ట్‌ టెస్టులో ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ కొంత వరకు రాణించాడు.

కానీ పెర్త్‌ టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరు కావడంతో ఇప్పుడు రెండో టెస్టులో ఈ ప్లేస్‌ కీలకం కానున్నది. జైస్వాల్‌తో రోహిత్‌ ఓపెనింగ్‌ చేసే చాన్స్‌ ఉంది. ఇక వన్‌డౌన్‌లో కేఎల్‌ రాహుల్‌ వస్తాడనుకుంటున్నారు. అదే జరిగితే గిల్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాల్సి వస్తుంది.

ఆసీస్ కు ఊహించని షాక్..

ఇక భారత్‌తో జరిగే రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. పక్కటెముకల గాయంతో రెండో టెస్టుకు ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. అతడి స్థానంలో ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు సీన్ అబాట్, బ్రెండన్ డెగాట్‌లు ను జట్టులోకి తీసుకుంది.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ షెడ్యూల్..

డిసెంబర్ 06-10: రెండో టెస్టు – అడిలైడ్
డిసెంబర్ 14-18: మూడో టెస్టు – బ్రిస్బేన్
డిసెంబర్ 26-30: నాలుగో టెస్టు – మెల్‌బోర్న్
జనవరి 03-07: అయిదో టెస్టు – సిడ్నీ

Exit mobile version