Friday, November 22, 2024

Second Phase – రెండో విడుత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది.

రెండో దశ ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నేటి ఉదయం నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడుతలో ఔటర్‌ మణిపూర్‌లోని ఒక సీటుతోపాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపీ స్థానాల్లో ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరుగనుంది.

ఏప్రిల్‌ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జమ్ము కశ్మీర్‌ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 5న జరుగనుంది. జమ్మలో మాత్రం ఏప్రిల్‌ 6న నామపత్రాలను పరిశీలించనున్నారు.

రెండో విడతలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని అకోలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్తాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.

- Advertisement -

కాగా, మొదటి విడుత నోటిఫికేషన్‌ను మార్చి 20న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 102 ఎంపీ స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement