రెండోరోజు తెలంగాణలో పీఎం మోదీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. నగరంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది.
ఉదయం ఈ ఎన్నికల ప్రచార సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రధాని ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నాగర్‌కర్నూల్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ అనంతరం హెలికాప్టర్ లో కర్ణాటకలోని గుల్బార్గాకు వెళ్తారు.
ట్రాఫిక్ ఆంక్షలు
ఇవాళ ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని వెళతారు. ఆ సమయంలో వివి విగ్రహం, మెట్రో రెసిడెన్సీ లేన్, ఎంటిఎస్ రాజ్ భవన్, పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, హెచ్‌పిఎస్ అవుట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్‌టి ఫ్లై ఓవర్, ఎయిర్‌పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మోడీ పర్యటనకు సంబంధించిన భద్రతా చర్యల్లో భాగంగా, రహదారి ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, పారా గ్లైడింగ్ నిషేధించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రోడ్ షో ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.