Friday, November 22, 2024

జులై 10న దుబ్బాకలో రెండో విడత గృహ ప్రవేశాలు..

దుబ్బాక, (ప్రభ న్యూస్‌) : దుబ్బాకలో నిర్మాణాలు పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లలో రెండో విడత ప్రవేశాలు ఈ నెల 10వ తేదీన చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌ రావు తెలిపారు. సోమవారం దుబ్బాక పట్టణంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను పరిశీలించారు. ఇప్పటికే మొదటి విడత ప్రవేశాలు పూర్తయి, నివసిస్తున్న వారికి మిషన్‌ భగీరథ నీటి సరఫరా అవడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో వారి ఇండ్లను కూడా పరిశీలించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం నిర్మించిన ఓవర్‌ హెడ్‌ స్టోరేజ్‌ రిజర్వాయర్‌కు భగీరథ నీటిని అధికారులు సరఫరా చేయక పోవడం వల్ల లబ్ధిదారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా అయిన నీటిని బ్యారళ్ళలో నింపుకుని తీసుకెళుతున్న దృశ్యాలను ఎమ్మెల్యే పరిశీలించారు. మొదటి విడతగా నిర్మించిన గృహాల వద్ద సీసీ రోడ్డుపై వర్షపు నీరు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించారు. అదే విధంగా మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన బ్లాక్‌లకు వెళ్ళే దారి లో మురికికాల్వ నిర్మాణాన్ని అసంపూ ర్తిగా వదిలేయడంతో అక్కడ కూడా నీరు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పాటు, నీటిని ఎ టు మళ్ళించాలో అధికారులు ఇంకా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. మిషన్‌ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేయాల్సిన యంత్రాంగం నీటి సరఫరా చేయకుండా గృహాల లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం ఎంత మాత్రం సహించరానిదన్నారు.

తక్షణమే నిర్మాణాలు పూర్తయిన ప్రతి ఇంటికీ మౌళిక వసతులన్నీ పూర్తి చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీ రథ అధికారులతో మాట్లాడి, లబ్ధిదారు లకు నీటిని సరఫరా చేయడంలో కేవలం నీటిని లిఫ్టు చేయాల్సిన పైపును సాకుగా చూపిస్తూ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. యుద్ధ ప్రాతిపదికన నీటి సరఫరా కనెక్షన్‌ ఇవ్వాలని కోరారు. తెల్లారే సరికల్లా లబ్ధిదారుల ఇండ్లకు నీటి సరఫరా అయ్యేలా పనులు చేపట్టాలని సూచించారు. పనులు పూర్తయ్యేవరకు తాను కూడా ఇక్కడే ఉంటానని ఎమ్మెల్యే అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ మట్ట మల్లారెడ్డి, బీజేపీ నాయకులు అంబటి బాలేష్‌ గౌడ్‌, చింత సంతోష్‌, సుభాష్‌ రెడ్డి, గాజుల భాస్కర్‌, సుంకు ప్రవీణ్‌, సాయి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు అరిగె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement