Friday, November 22, 2024

గవర్నర్‌తో చర్చలు లీక్.. హైకోర్టుకు నిమ్మగడ్డ

తాను గవర్నర్ తో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీకవుతున్న విషయంపై విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐతో విచారణ జరపాలని కోరారు. తాను గవర్నర్ కు రాస్తున్న లెటర్స్ అన్ని పబ్లిక్ కాదని, ప్రివిలేజ్ లెటర్స్ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అవి గవర్నర్ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో విచారణ జరపించాలని కోరారు. తాను సెలవు పెడుతున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయని, మంత్రులు తాను గవర్నర్ కు రాసిన లెటర్స్ సోషల్ మీడియాలో చూశామని అంటున్నారని… అది ఎలా సాధ్యమో విచారించాలన్నారు. గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ఈ పిటిషన్‌లో నిమ్మగడ్డ ప్రతివాదులుగా చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement