పబ్లిక్ ఆఫర్ ముగిసిన తరువాత స్టాక్ మార్కెట్లలో షేర్ల లిస్టింగ్‌కు ప్రస్తుతం ఉన్న 6 రోజుల సమయాన్ని 3 రోజులకు తగ్గించాలని సెబీ ప్రాతివాదించింది. దీని వల్ల ఐపీఓకు వచ్చిన కంపెకనీకి, ట్రేడర్స్‌కు కూడా ప్రయోజకరంగా ఉంటుందని సెబీ తెలిపింది. పబ్లిక్ ఇష్యూ జారి చేసిక కంపెనీలకు త్వరగా క్యాపిట్ మార్కెట్ త్వరగా యాక్సెస్ లభించడంతో పాటు బిజినెస్ చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుందని, ఇన్వెస్టర్లక తమ పెట్టుబడికి నగదు లభ్యత అందుబాటులోకి వస్తుందని సెబీ విడుదల చేసిన సంప్రదింపుల పేపర్లో పేర్కొంది.
మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ 2018 నవంబర్‌లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ)న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ప్రవేశపెట్టింది. బ్లాక్ చేసిన మొత్తాన్ని (ఏఎస్బీఏ) ద్వారా సపోర్ట్ చ సే అప్లికేషన్‌తో అదనపు చెల్లింపు విధానంగా దీన్ని పరిచయం చేసింది. ఇష్యూ ముగిసిన ఆరు రోజుల లోపు లిస్టింగ్ కోసం టైమ్‌లైన్ సూచించింది. సెబీ జారీ చేసిన ఈ ప్రతిపాదనపై జూన్ 3 లోగా అభిప్రాయాలను కోరింది. స్టాక్మార్కెట్లో సంబంధం ఉన్న అన్ని వర్గాలను, స్టాక్ మార్కెట్లను, స్పాన్సర్ బ్యాంక్‌లను, ఎన్బీసీఐ, డిపాజిట్‌దారులను, రెగ్యులేటర్స్తోనూ చర్చించిన తరువాత ఈ ప్రతిపాదన చేసింది. దీనిపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయలు సేకరించిన తరువాత తుది నిర్ణయం తీసుకోనుంది.