అదానీ షేర్ల విక్రయం వ్యవహారంలో సెబీ విచారణ జరపనుంది. 2.5 బిలియన్ల విలువైన షేర్ల విక్రయంలో చట్టాల ఉల్లంఘన ఏమైనా జరిగిందా, వీటిని విక్రయించడంలో ఏమైనా ఇతర ప్రయోజనాలు ఇందులో ఉన్నాయా అన్న విషయాన్ని సెబీ విచారణ జరపనుందని దీంతో సంబంధం ఉన్న వారు తెలిపారు. మారిషస్‌కు చెందిన గ్రేట్ ఇంటర్నేషనల్ టస్కర్ ఫండ్, ఆయుష్మత్ లిమిటెడ్ యాంకర్ ఇన్వెస్టర్లుగా ఈ షేర్లుగా ఉన్నాయి. అదానీ గ్రూప్‌కు, యాంకర్ ఇన్వెస్టర్లుగా పాల్గొన ్న సంస్థల మధ్య సంబంధాలను సెబీ పరిశీలిస్తోంది. మన దేశ చట్టాలు, నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయించిన సంస్థకు గాని, ఆ సంస్థ వ్యవస్థాపకుడితో ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఇలా సంబంధం ఉన్న సంస్థలు యాంకర్ ఇన్వెస్టరుగా దరఖాస్తు చేసుకోవడానికి వీలుకాదు. ఇప్పుడు సెబీ దీనిపై విచారణ జరపనుంది. హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ పన్నులు ఎగ్గొట్టేందుకు షెల్ కంపెనీల పేరుతో మానీ లాండరింగ్‌కు పాల్పడుతుందని, షేర్ల విషయంలో గోల్మాలుకు పాల్పడింది ఆరోపించింది.
ఎలారా క్యాపిటల్, మోనార్క్ నెట్‌వర్త్ సంస్థలకు కూడా సెబీ పరిశీలనలో ఉన్నాయి. అదానీ కంపెనీ షేర్ల విక్రయంలో వీటి పాత్రపై కూడా సెబీ పరిశీలన జరుపుతున్నది. అదానీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ మోనార్క్ లో చిన్న వాటా కలిగి ఉందని హిండెన్‌బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ గతంలో అదానీ గ్రూప్‌కు బుక్రన్నర్గా పని చేసిందని పేర్కొంది. అదానీ గ్రూప్‌తో ఈ సంస్థకు ఉన్న సన్నిహిత సంబంధం స్పష్టమైన వైరుధ్య ప్రయోజనాన్ని కలిగి ఉందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. మారిషస్‌కు చెందిన ఎలారా ఫండ్ తన మార్కెట్ విలువలో 99 శాతం మూడు అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని హిండెన్‌బర్గ్ తెలిపింది. మోనార్క్‌కు ఉన్న సామర్ధ్యాలను, రిటైల్ మార్కెట్‌ను టాప్ చేయగలిగి ఉన్నందున షేర్ల విక్రయానికి ఎంపిక చేసినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపణలకు అదానీ సమాధానం ఇచ్చారు. తమ కంపెనీలో అదానీ గ్రూప్ 2016 నుంచి కేవలం 0.03 శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నట్లు మోనార్ తెలిపింది. దీనిపై రాయిటర్స్ వార్తా సంస్థ పబ్లిక్ రికార్డుల నుంచి దీన్ని నిర్ధారించలేకపోయింది. ఎలారా మాత్రం హిండెన్‌బర్గ్ ఆరోపణల పై స్పందించలేదు.
హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఆందోళన వెలుబుచ్చిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో దీనిపై ఆందోళన చేశాయి. విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ దీనిపై ప్రధాని కార్యాయాలనికి సమాచారం ఇచ్చిందని రాయిటర్స్ పేర్కొంది. సెబీతోనూ దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అదానీ గత ఆర్ధిక నివేదికలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఫిబ్రవరి 2 నుంచి సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సుప్రీం కోర్టులో విచారణ..
హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత భారీగా షేర్లు పతనం కావడంతో ఇన్వెస్టర్లు నష్టపోయారు. దీనిపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఇన్వెస్ట ర్లను రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం లోగా స్పందించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ)ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన ప్రేమ్‌వర్క్ ను ఎలా ఏర్పాటు చేయవచ్చో వివరించాలని సుప్రీం కోర్టు కోరింది. ఇన్వస్టర్లు లక్షల కోట్లు నష్టపోయినట్లు చెబుతున్నారని, దీన్ని బట్టి ఇన్వెస్టర్లు రక్షించబడతారని ఎలా నమ్మాలని సుప్రీం ప్ర శ్నించింది. ఇన్వెస్టర్లు 10 లక్షల కోట్ల వరకు నష్టపోయినట్లు చెబుతున్నారని పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి జరగకుండా ఏం చేయాలని ఆలోచిచాలని, ఈ విషయంలో భవిష్యత్‌లో సెబీ ఎలాంటి పాత్ర పోషిస్తుందని కోర్టు ప్రశ్నించింది.
సెబీకి విస్తృత అధికారాలు కల్పించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో కొన్ని కమిటీలు ఉండాలనేది ఒక సలహా అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. కోర్టుకు సెబీపైనా, ఇతర నియంత్రణ సంస్థలపై ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేసింది. కొన్ని ఇన్పుట్లను పొం దకలిగేలా విస్తృత ఆలోచనా విధానాన్ని కలిగి ఉండాలని కోర్ట్ అభిప్రాయపడింది. ఈ విషయంలో చట్టంలో సవరణ అవసరమా, రెగ్యూలేటరీ ప్రేమ్వర్క్లో ఏమైనా సవరణలు చేయాలనే దానిపై ప్రభుత్వం పరిశీలించాల్సి ఉందని కోర్టు తెలిపింది. విధానపరమైన నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోబోమని అయితే ఇలాంటివి మళ్లి జరగకుండా ఉండేందుకు ఒక యంత్రాంగం మాత్రం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
సెబీ, ఇతర నియంత్రణ సంస్థల విషయంలో ఏర్పాటు చేసే కమిటీలో సెక్యూరటీస్కు సంబంధించిన నిపుణులు, మాజీ న్యాయమూర్తి లేదంటే అంతర్జాతీయ ఆర్ధిక న్యాయ నిపుణుడు ఉండవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. కోర్టు సెబీకి విస్తృత పరిధిని ఇవ్వగలదని, ప్రస్తుతం ఉన్న అధికారాలను విశ్లేషించగలదని కోర్టు తెలిపింది. మార్కెట్ రెగ్యులేటర్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నదని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని నిపుణులలో సొలిసిటర్ జనరల్ సంప్రదింపలు జరపవచ్చని కర్టు సూచించింది. కోర్టుకు ఒక ఫ్రేమ్‌వర్క్ ఇవ్వాలని, కోర్టు ఏం మాట్లాడినా అది మార్కెట్ పై ప్రభావం చూపుతుందని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. సెబీని దీనిపై సోమవారం లోగా స్పందించాలని ఆదేశించిన సుప్రీం కోర్టు విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. హిండెన్‌బర్గ్ నివేదికపై రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
అమెరికా లా ఫర్మ్ వాచ్‌టెల్..
హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై పోరాడేందుకు అదానీ గ్రూప్ అమెరికాకు చెందిన న్యాయ సంస్థ వాచ్‌టెల్‌ను నియమించుకుంది. దీన్ని ఎలా ఎదుర్కొవాలో న్యాయ సలహా కోరుఏందుకు అదానీ గ్రూప్ వాచ్‌టెల్‌తో పాటు లిప్టన్, రోసెన్ అండ్ కడ్జ్ న్యాయవాదులను సంప్రదించినట్లు బ్రిటిష్ డైలీ ఒకటి తెలిపింది. న్యూయార్ ్కకు చెందిన వాచ్‌టెల్ కార్పొరేట్ చట్టాల్లో నైపుణం కలిగి ఉంది. అనేక సంక్షిష్టమైన కేసులను ఇది టేకప్ చేసింది. హిండెన్‌బర్గ్ నవేదిక అదానీ గ్రూప్‌పై తీవ్రంగా పడింది. ఈ గ్రూప్ షేర్లన్నీ భారీగా నష్టపోయాయి. హిండెన్‌బర్గ్ నివేదికను ఖండిస్తూ అదానీ గ్రూప్ 413 పేజీల వివరణ విడుదల చేసింది. దీన్ని హిండెన్‌బర్గ్ తోసిపుచ్చింది. జాతీయ వాదం పేరుతో మోసాన్ని కప్పిపుచ్చలేరని ఘూటుగా స్పందించింది. ఈ వివరణ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్గించలేకపోయింది.
దీంతో షేర్ల పతనం మాత్రం ఆగడంలేదు. రుణాలను ముందుగానే చెల్లిస్తున్నట్లు చేసిన ప్రకటన కొంత మేర షేర్లు లాభపడేందుకు తోడ్పడింది. అయితే అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు మాత్రం అదానీ గ్రూప్ రేటింగ్స్‌ను తగ్గించాయి. దీంతో మళ్లి షేర్లు పతనం కొనసాగింది. ప్రధానంగా మోర్గాన్ స్టాన్టీ క్యాపిటల్ ఇంట ర్నేషనల్ (ఎంఎస్సీఐ) సూచీల్లో అదానీ గ్రూప్ కంపెనీల వెయిటేజీని పున: సమీక్షిస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు అదానీ కంపెనీల వెయిటేజీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీ ని ప్రభావం శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కనిపించింది.
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసె ఎనిమిది అదానీ గ్రూప్ కంపెనీల్లో 4 కంపెనీల ఔట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి నెగటివ్‌లోకి మార్చింది. మిగిలిన 4 కంపెనీలను మాత్రం స్టేబుల్ స్టేటస్‌లోనే కొనసాగించనున్నట్లు తెలిపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై (ఏఈఎంఎల్ను, అదానీ గ్రీన్ ఎనర్జీ గ్రూప్‌లో ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీ(యూపీ) పరమపూజ్య సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ప్రయత్నా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్టేబుల్ నుంచి నెగిటివ్‌గా మార్చినట్లు మూడీస్ తెలిపింది. అదానీ పోర్టులను మాత్రం స్టేబుల్ కేటగరిలోనే ఉంచింది.