Tuesday, November 19, 2024

సెబీ అజయ్‌త్యాగి స్థానంలో కొత్త చైర్మ‌న్ ని ఎంపిక చేసిన కేంద్రం..

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ)కి కేంద్రం కొత్త చైర్మన్‌ను ఎంపికచేసింది. ప్రస్తుత చైర్మన్‌ అజయ్‌త్యాగి ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ఆ పదవిలో సెమీ మాజీ సభ్యురాలు మాధవి పూరీబుచ్‌ నియమితులయ్యారు. కేపిటల్‌ మార్కెటింగ్‌ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి చైర్‌పర్సన్‌గా ఓ మహిళా అధికారిణిని నియమించడం ఇదే తొలిసారి. మూడేళ్లపాటు ఆమె నియామకానికి కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం తెలిపిందని సమాచారం. కాగా ఐసీఐసీఐ బ్యాంకులో కెరీర్‌ను ప్రారంభించిన మాధవి సుమారు రెండు దశాబ్దాలపాటు ఆమె అదే గ్రూప్‌లో పనిచేశారు. 2009 నుంచి 2011మధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఎండీగా, సీఈవోగా మాధవి కీలక బాధ్యతలు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement