Friday, November 22, 2024

పీవీఆర్‌, ఐనాక్స్‌ విలీనానికి సెబీ ఆమోదం.. అత్యధిక స్క్రీన్స్‌ ఉన్న సంస్థగా ఆవిర్భావం..

దేశంలో మల్టిఫ్లెక్స్‌ సినిమా థియేటర్లను నిర్వహిస్తున్న పీవీఆర్‌, ఐనాక్స్‌ సంస్థల విలీనానికి సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛైంజ్‌ బోర్డు (సెబీ) ఆమోదం అభించింది. ఈ రెండు సంస్థలు విలీనం అవుతున్నట్లు ఈ సంవత్సరం మార్చిలో ప్రకటించాయి. సెబీ అనుమతి లభించడం ఈ ప్రక్రియలో పెద్ద ముందడుగని ఈ సంస్థలు ప్రకటించాయి. రెండు సంస్థల విలీనంతో దేశంలో అత్యధిక సంఖ్యలో మల్టిఫ్లెక్స్‌ సినిమా థియేటర్లు కలిగిన సంస్థగా ఆవిర్భవించనున్నాయి. విలీనం తరువాత ఏర్పడే సంస్థకు 1500 స్క్రీన్స్‌ ఉంటాయి. పీవీఆర్‌లో ఐనాక్స్‌ విలీనం కానుంది.

విలీనం ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని సంస్థల నుంచి చట్టబద్దమైన అనుమతులు రావాల్సివుంది. విలీనం తరువాత ఐకాన్స్‌ ప్రమోటర్స్‌ పీవీఆర్‌ కో-ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తారు. పీవీఆర్‌ ప్రమోటర్స్‌కు కొత్త సంస్థలో 10.62 శాతం వాటా, ఐకాన్స్‌ ప్రమోటర్స్‌కు 16,66 శాతం వాటా ఉంటుంది. విలీన ప్రక్రియ పూర్తయిన తరువాత బోర్డలో రెండు సంస్థలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement