Tuesday, November 26, 2024

మూడు కంపెనీల ఐపీఓకి సెబీ ఆమోదం

సెబీ మంగళవారం మరో మూడు కంపెనీల ఐపీఓకి ఆమోదం తెలిపింది. క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌, నేచురల్‌ బైప్రొడక్ట్స్‌, మైనీ ప్రెసిషన్‌ ప్రొడక్ట్స్‌ ఐపీఓలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వాణిజ్య వాహనాల ధరలను పెంచనున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. టాటా మోటార్స్‌ కంపెనీ షేర్లు 3శాతం లాభపడ్డాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపె విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.19వద్ద ట్రేడ్‌ అవుతుంది. కాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం మనపై స్వల్పంగా ఉన్నందున ధరలు త్వరలోనే అదుపులోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు. సీఐఐ సోమవారం నిర్వహించిన సదస్సులో దాస్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రూపాయి మారకపు విలువలోనూ స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే శక్తి మన

ఆర్థికవ్యవస్థకు ఉందన్నారు. విదేశీ మారకపు నిల్వలు అధికంగా ఉండటంతోపాటు కరెంటుఖాతా లోటు తక్కువగా ఉండటం మనకు ఉపకరించే అంశాలని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement