Saturday, September 14, 2024

TG | స్థానికత ప్రకారమే సీట్లు… హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట

తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 33 వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. జీవో 33ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలవ్వడంతో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన సరైనదేనని వ్యాఖ్యానించిన కోర్టు.. సీట్ల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కోర్టు సూచనలు..

జీవో నంబరు 33లో స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. స్థానికత నిర్ధరణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. పిటిషనర్ల స్థానికతను నిర్ధారించుకున్నాకే వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసులేనా కాదా అన్నది పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఇందుకోసం ప్రస్తుతం మార్గదర్శకాలు లేనందున కొత్తగా రూపొందించి, అమలు చేయాలని కాళోజీ వర్సిటీని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement