పండుగలు, పబ్బాలప్పుడు, ఉత్సవాలు, వేడుకల సందర్భంగా వేళాపాళా లేకుండా, అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు బాణసంచా కాల్చకుండా ఉండటం కోసం దేవస్థానాలు, చర్చిలు తదితర ప్రార్థనా మందిరాల్లో సోదాలు చేపట్టి అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను స్వాధీనం చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కేరళ హైకోర్టు ఆదేశించింది. వేళకానివేళలో బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనిపౖౖె వచ్చే విచారణ నాటికి ఒక నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 24కు వాయిదా వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement