Tuesday, November 26, 2024

వీడియో: సముద్రం నిన్న ముందుకు.. నేడు వెనక్కు.. అసలు ఏం జరుగుతోంది?

బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా పలు చోట్ల సముద్రం వెనక్కి వెళ్లింది. ఏపీలోని అంతర్వేది వద్ద రెండు కిలోమీటర్లకు పైగా సముద్రం వెనక్కి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని ప్రసిద్ధ కన్యాకుమారిలో కూడా సముద్రం వెనక్కి వెళ్లడంతో.. బండరాళ్లు బయటపడ్డాయి.

మరోవైపు బుధవారం నాడు సముద్రం ముందుకు వెళి.. గురువారం నాడు సముద్రం వెనక్కి వెళ్లడంతో పలుచోట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో భూకంపం రావడం, అలలు అసహజంగా ఉండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రగర్భంలో తీవ్ర మార్పులు జరిగే సమయంలో అలలు ప్రశాంతంగా ఉంటాయని… విపత్తు చోటు చేసుకునే ముందు ఉండే ప్రశాంతత లాంటిదని జాలరులు చెపుతున్నారు. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి నాడు ఇలా జరుగుతుందని.. ఈ రెండు కాకుండా సముద్రంలో ఇలా మార్పులు జరిగాయంటే ఏదో ఉపద్రవం రాబోతున్నట్లు పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement