Thursday, December 12, 2024

TG | 2 వేల మందితో ఎస్డీఆర్ఎఫ్.. ప్రత్యేక బలగాలకు 35.03 కోట్లు మంజూరు !

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ మైదానంలో ఈరోజు హోంశాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎస్‌డిఆర్‌ఎఫ్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటు, ఆధునికీకరణ కోసం రూ.35.03 కోట్లు మంజూరు చేసింది.

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన బోట్లను కూడా సీఎం ప్రారంభించారు. అదేవిధంగా ఈ వేడుకల్లో తెలంగాణ పోలీసుల ధైర్యసాహసాలను చాటిచెప్పేలా పలు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల ప్రదర్శన ప్రజా ప్రతినిధులు, అధికారులను ఆకట్టుకుంది.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. పోలీసులపై ఒత్తిడి లేకుండా కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకుందన్నారు. సైబర్ నేరాల నివారణకు ప్రభుత్వం పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. పోలీసు శాఖలో ఎలాంటి అవాంతరాలు లేకుండా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశామని సీఎం పునరుద్ఘాటించారు.

ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్‌ విధుల్లో చేర్చి ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సమాజ నిర్లక్ష్యానికి గురైన వారి విధులను పోలీసు శాఖ సద్వినియోగం చేసుకుంటుందన్నారు. డ్రగ్స్ అమ్మకానికి హైదరాబాద్ భయపడే విధంగా పోలీసులు విధులు నిర్వహించాలని సీఎం సూచించారు.

- Advertisement -

అలాగే డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా సంస్థల యజమాన్యాల‌తో పోలీసు కమిషనర్లు క్రమశిక్షణా సమావేశాలు నిర్వహించాలన్నారు. డ్రగ్స్ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఆరు నెలల్లో తీర్పు వెలువరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement