అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) తిరుపతి-వికారాబాద్, నాందేడ్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. రైలు నెం.07652 తిరుపతి-వికారాబాద్ ప్రత్యేక రైలు ఆగస్టు 9వ తేదీ రాత్రి 10.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో ప్రత్యేక రైలు ఆగుతుంది.
రైలు నెం.07651 నాందేడ్-తిరుపతి స్పెషల్ ఆగస్టు 8వ తేదీ రాత్రి 11.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.15 గంటలకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో ముద్‌ఖేడ్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డి, అకనాపేట్, మేడ్చల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుడ్డ స్టేషన్‌లలో ప్రత్యేక రైలు ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో AC II టైర్, AC III టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.