మహీంద్రా అండ్ మహీంద్ర కంపెనీ కొత్తగా మార్కెట్‌లో విడుదల చేసిన స్కార్పియో క్లాసిక్ ధరలను ప్రకటించింది. క్లాసిక్ -ఎస్, క్లాసిక్-11 పేరిట రెండు వేరియంట్లను కంపెనీ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. క్లాసిక్-ఎస్ ఎక్స్‌షోరూమ్ ధర 11.99 లక్షలుగా ప్రకటించింది. క్లాసిక్011 ధర 15.49 లక్షలుగా పేర్కొంది. ఇవి రెడ్, బ్లాక్, సిల్వర్, వైట్ కలర్స్‌లో లభిస్తాయి.
గత మోడల్స్‌తో పోల్చితే క్లాసిక్ 55 కిలోల బరువు
తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ 132 పీఎస్ పవర్‌ను, 300 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 మాన్యవల్ గేర్‌బాక్స్‌తో క్లాసిక్ వస్తుంది. గత మోడల్స్‌తో పోలచితే 14 శాతం అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. మెరుగైన సస్పెన్షన్ ఆర్ 17 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, నూతన డీఆర్‌ఎల్ వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. 9 అంగుళాల టచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అండ్రాయిడ్ ఓఎస్‌తో పని చేస్తుంది. ఇందులో స్క్రీన్ మిర్రరింగ్ సదుపాయం ఉంది. స్కార్పియో క్లాసిక్ 7,9 సీట్ల సామర్ద్యంతో అభిస్తాయి.