భారత్-శ్రీలంక మధ్య హోరాహోరీగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అయ్యింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ శ్రీలంక నిర్దేశించిన 231 పరుగుల ఛేదనలో 230 పరగులకు టీమ్ ఇండియా ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ (58) శుభారంభం అందించినా, మిగతా బ్యాట్స్‌మెన్ అదే జోరును కొనసాగించలేకపోయారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే వికెట్లు పోగొట్టుకున్నారు. దీంతో 230 పరగులకు టీమ్ ఇండియా ఆలౌట్ అయ్యింది.
ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించింది. కాగా, శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ పాతుమ్ నిస్సంక (56), దునిత్ వెల్లలాగే (62 నాటౌట్) రాణించారు.