(ప్రభ న్యూస్ ప్రతి నిధి, వికారాబాద్) జిల్లాలో దాదాపు 60 వేల వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరో 20 వేల వరకు అక్రమంగా రైతులు విద్యుత్‌ను వ్యవసాయ పంపు సెట్లకు వినియోగిస్తున్నారు. ఇక జిల్లాలో 2 లక్షల వరకు గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరో 50 వేల వరకు వ్యాపార.. వాణిజ్య.. పరిశ్రమల విద్యు త్ కనెక్షన్లు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 3 లక్షల పైబడి విద్యుత్‌కనెక్షన్లు ఉన్నాయి. గత రెండు మా సాలుగా జిల్లాలో విద్యుత్ డిమాండ్ కొత్త రికా ర్డులను నమోదు చేసు కుంది. రోజువారి విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజు విద్యుత్ డిమాండ్ 5 మిలియన్ యూ నిట్లు దాటినట్లు విద్యుత్ శాఖ పేర్కొంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విద్యుత్ డిమాండ్ కనిపించలేదని గుర్తుచేస్తు న్నారు. రైతులు రబీలో సాగు చేసిన వరిధాన్యం పంట చేతికొచ్చినా విద్యుత్ డిమాండ్‌లో తగ్గుదల నమోదు కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం వ్యవసాయంకు పెద్దగా విద్యుత్‌ను వినియోగిం చడం లేదు. అయితే ఇతర వర్గాల నుంచి విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటి నుంచి వ్యవసాయ రంగంకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నారు. ఈ విష యాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గొప్ప గా చెప్పుకుంటోంది. వాస్తవానికి వ్యవసాయ రంగంకు నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం 24 గంటల పాటు ఉచితంగా పంపిణీ చేస్తూ వస్తోంది. అయితే గత రెండు వారాలుగా మాత్రం వ్యవసాయ రంగంకు పంపిణీ చేస్తున్న ఉచిత విద్యుత్‌కు కోతలు పెడుతోంది. మొదట 8 గంటల పాటు కోత విధించారు.
ప్రస్తుతం 10 గంటల పాటు కోత పెడుతున్నారు. గత రెండు రోజుల నుంచి 12 నుంచి 14 గంటల పాటు వ్యవసాయ రంగంకు పంపిణీ చేస్తున్న ఉచిత విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వ్యవసాయ రంగంకు ఉచిత విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతోనే వ్యవసాయ రంగంకు కోతలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైతులు ఎక్కడా వ్యవసాయంకు విద్యుత్‌ను వినియోగించడం లేదని..కావున కొంత మేరకు కోతలు విధించి ఇతర వర్గాలకు పూర్తిస్థాయిలో విద్యుత్ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. గరిష్ఠ స్థాయిలోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే విద్యుత్ డిమాండ్ అంతకంతకూ పెరగడంతో వ్యవసాయ రంగంకు కోతలు విధించాల్సి వస్తోంది. జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయితేనే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇది జరగాలంటే భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులలోకి పెద్ద ఎత్తున నీరు చేరితేనే సాధ్యం అవుతుంది. మరోవైపు వ్యవసాయ రంగంకు పంపిణీ చేస్తున్న విద్యుత్ విషయంలో కోతలు విధించినా ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్య లేదు. అయితే భారీ వర్షాలు కురిస్తే రైతులు వరి సాగును ప్రారంభిస్తారు. అప్పుడు రైతుల నుంచి విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు ప్రస్తుతం 11 గంటల పాటు వ్యవసాయ రంగంకు ఉచిత విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల పాటు ఉచితంగా పంపిణీ చేస్తే బోర్లలో నీటి మట్టం తగ్గిపోతున్నట్లు రైతులు గుర్తుచేస్తున్నారు. ఉచిత విద్యుత్‌కు కోతలు విధించి ఉదయం వేళ పంపిణీ చేయడాన్ని కూడా రైతులు స్వాగతిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.