హైదరాబాద్, ఆంధ్రప్రభ: పాఠశాల విద్యార్థులు సురక్షితంగా పాఠశాలలకు వెళ్లి తిరిగి అంతే సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు కొత్త విధానాన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేయనున్నారు. స్కూల్ జోన్స్ పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని పాఠశాలలను ప్రమాద రహిత ప్రాంతాలుగా మార్చేందుకు కార్యచరణ రూపొందించారు. నాలుగైదు పాఠశాలలున్న ప్రాంతాన్ని స్కూల్ జోన్ల కింది తీసుకురానున్నారు. జూన్ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మొదట ప్రయోగాత్మకంగా అబిడ్స్, జూబ్లిహిల్స్, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లోని పాఠశాలను ఎంపిక చేశారు.
జూబ్లిహిల్స్‌లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్, అబిడ్స్‌లోని చిరాగ్ అలీలేన్‌లో ఉన్న నాలుగు పాఠశాలలు, తిరుమలగిరిలోని పాఠశాలలను తొలుత ఎంపిక చేశారు. ఈ పాఠశాలలు ప్రధాన ప్రాంతాల్లో ఉండడంతో విద్యార్థులు అటూ ఇటూ రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయనున్నారు. పాఠశాలలున్న రహదారికి సమీపంలోకి వాహనదారులు రాగానే స్కూల్‌జోన్ అని స్పష్టంగా కనిపించేలా సైన్‌బోర్డులు, రహదారులపై ప్రత్యేక రంగులు వేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..