(ప్రభన్యూస్) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులలో ప్రభుత్వ, పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా కాలంగా గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు చదువులు అంతంతా మాత్రంగానే కొనసాగాయి. దీంతో విద్యార్థులు ఇప్పటికే చాలా వెనుకబడి ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అన్ని పరీక్షలను నిర్వహించింది. మరికొద్ది రోజులలో 10వ తరగతి, ఇంటర్ ఫలితాలు రానున్నాయి. మరో రెండు రోజులలో బడి గంట మోగడంతో విద్యార్థులంతా పాఠశాలలకు హజరవుతారు. కానీ చదువుకోవడానికి ఏ ఒక్కరికి కూడ పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. జిల్లాలో ఏ ప్రభుత్వ పాఠశాలకు ఇప్పటివరు పాఠ్యపుస్తకాలు పంపిణి చేయలేదు.
ఎప్పుడు వస్తాయో కూడ తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తునే మరోవైపు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. కావున పాఠశాలలు తెరుచుకునే ఈ రెండు రోజులలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు పాఠ్య పుస్తకాలు అందించాలని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.