Thursday, November 21, 2024

రేప‌టి నుంచి స్కూళ్ల‌కు సెలవు.. ఉపాధ్యాయులు మాత్రం హాజరుకావల్సిందే..

ఉమ్మడిరంగారెడ్డి, (ప్రభన్యూస్‌) : వేసవి సెలవులు వచ్చేసాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించారు. ఇదే సమయంలో 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు కూడా పూర్తి చేశారు. 42 రోజులపాటు బడులకు సెలవులు కొనసాగనున్నాయి. సెలవులంటే ఉపాధ్యాయులకు కూడా సెలవులు ఉండేవి. కానీ ఈసారి మాత్రం రోజుకో ఉపాధ్యాయుని చొప్పున బడికి హాజరుకావల్సి ఉంటుంది. పదవ తరగతి విద్యార్థులకు వచ్చేనెల చివరి వారంలో పైనల్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్పెషల్‌ క్లాసులు ఏర్పాటు చేసి పదికి విద్యార్థులను సమాయత్తం చేశారు.

విద్యార్థులు నేర్చుకున్నది మరిచిపోకుండా ఉండేది రోజుకో సబ్జెక్టు ఉపాధ్యాయుడు వచ్చి పది విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేయాల్సి ఉంటుంది. మే 6వ తేదీనుండి ఫ్రీపైనల్‌ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇవి పూర్తి కాగానే మే చివరి వారంలో ఫైనల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే మాసం మొత్తం పరీక్షల మాసంగా మారింది. 9వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో వారి ఆనందానికి అవదులు లేకుండాపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement