Friday, October 4, 2024

ADB: ఆర్జీయూకేటీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం పర్యటన..

బాసర, ప్రభ న్యూస్ : ఆర్జీయూకేటీ బాసరలో శుక్రవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించింది. వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి లతో కలిసి కమిషన్ చైర్మన్ కు సభ్యులు ఆహ్వానం పలికారు. ఆనంతరం కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుష్రం నీలా, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణకుంట ప్రవీణ్ లు విద్యార్థులతో కలిసి భోజనశాలలో అల్పాహారాన్ని స్వీకరించారు. పరిపాలనా భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్ విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు విద్యార్థులు అధ్యాపకులను భర్తీ చెయ్యాలని, కేర్ టెకార్లను నియమించాలని, చీఫ్ వార్డెన్ శ్రీధర్ బాలికల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. యూనివర్శిటీలో విద్యార్థులకు వసతి లేక ఇబ్బందులు పడుతున్నామని కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ… విశ్వవిద్యాలయం తీసుకున్న చర్యలు, తీసుకోబోయే చర్యల గురించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.

విద్యార్థులు, ఉద్యోగుల సూచనలను పరిగణలోకి తీసుకొని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ విశ్వవిద్యాలయ అభివృద్ధికి కావలసిన నిధులు, తదితర అంశాలను కమిషన్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్ డిన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు, ఎస్సీ ఎస్టీ సెల్ కన్వీనర్ డాక్టర్ అజయ్ కుమార్, ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement