Thursday, November 21, 2024

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై న్యాయసమీక్షకు అవకాశం లేకుండా చేయాలి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల అంశాన్ని న్యాయసమీక్షకు అవకాశం లేకుండా చేయాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందిపరిచేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంపీలందరూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలే, ఆ శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యంను కలిసి తగు చర్యలు చేపట్టాలని కోరినట్టు సంఘం ప్రధాన కార్యదర్శి వీఎం రవిశంకర్ తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంపీలతో సమావేశం ఏర్పాటుచేస్తానని అథవాలే హామీ ఇచ్చినట్టు తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్దీకరించాలి..

కర్నాటకలో 2017లో పారిశుద్ధ్య కార్మికులను ఔట్‌సోర్సింగ్ విధానంలో తీసుకోవడాన్ని రద్దు చేస్తూ, వారి సేవలను రెగ్యులరైజ్ చేస్తూ నాటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యవహరించినట్టుగా, తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవహరించాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. వందల ఏళ్లుగా ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ కోవిడ్-19 వంటి భయంకర ప్రాణాంతక వ్యాధుల సమయంలోనూ సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే క్రమబద్దీకరించాలని కోరారు. ఈ అంశంపై లోక్‌సభలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నామ నాగేశ్వరరావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములును సంఘం ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement